ప్రేమ పేరుతో యువత వారి జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. కుటుంబం గురించి ఆలోచించకుండా వారి జీవితాన్ని వారే కడతేర్చకునే దుస్థితికి పాల్పడుతున్నారు. ప్రేమలో పడిన వారికి కుటుంబంతో పని లేకుండా పోతోంది. ప్రేమలో వున్న వారికి అంతా ప్రేమికులే జీవితంగా భావిస్తున్నారు. అదే ప్రేమ విఫలమైతే వారితో జీవించలేని బతుకు ఎందుకంటూ ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వారు మృతి చెందితే వారి ప్రేమించిన వ్యక్తి ఏమోగానీ.. మృతి చెందిన కుటుంబం ఏమవుతుందనే ఆలోచన కూడా లేకుండా పోతోంది ఈకాలం…