హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైనే వాహనాలను పార్క్ చేస్తుంటారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చాలా కాలంగా రోడ్లపై వదిలివెళ్లిన వాహనాలను పోలీసులు క్రేన్‌ల సహాయంతో తొలగిస్తున్నారు. ఆయా వాహనాలను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలను వదిలివెళ్లే వారికి ట్రాఫిక్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. 15 రోజులు కారు రోడ్డుపై కనిపిస్తే సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా రోడ్లపై వాహనాలు వదిలి వెళ్లేవారికి భారీగా జరిమానా…