Hyderabad Air Show: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర మంత్రులు, వీవీఐపీలు, సీనియర్ ఎయిర్ ఫోర్స్ అధికారులు పాల్గొంటారు. ఆదివారం మధ్యాహ్నం 4 గంటల నుంచి 5 గంటలకు సుమారు 30 నిమిషాల పాటు వాయిసేన విమానాల విన్యాసాలు జరగనున్నాయి. వైమానిక దళానికి చెందిన 9 సూర్యకిరణ్ విమానాలతో ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ షోకు ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి నాయకత్వం వహించనున్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన వైమానిక విన్యాసాలు చేసే ఐదు అత్యుత్తమ టీమ్‌లలో ఒకటైన సూర్యకిరణ్ టీమ్ హైదరాబాద్‌లో ప్రదర్శన ఇవ్వనుండడంతో ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారని భావిస్తున్నారు.
Read also: Nizamabad: డబ్బుల కోసం ముగ్గురు పిల్లలను అమ్మేసిన అమ్మ..
ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో వేడుకల ఏర్పాట్లపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఎయిర్ షో తర్వాత రాహుల్ సిప్లిగంజ్ సంగీత కచేరీ నిర్వహిస్తున్నందున నెక్లెస్ రోడ్, పీవీ మార్గ్‌లలో ప్రజల కోసం ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. నేడు ట్యాంక్‌బండ్‌పై ఎయిర్ షో సందర్బంగా.. ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని అన్నారు. ప్రయాణికులు సహకరించాలని తెలిపారు. వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు.
Pushpa 2 : పుష్ప-2 టికెట్ రేట్ అందరికి అందుబాటులో ఉంటుంది : మైత్రీ నిర్మాతలు