విజయవాడ నగరంలో ట్రాఫిక్ పోలీసుల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వెళుతున్న వాహన చోదకులకు జరిమానాలు విధించడంతో సరిపెట్టకుండా సోషల్ మీడియాలో రీల్స్ చేయటం ఇప్పుడు వివాదానికి కారణమైంది సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అవగాహన కల్పించడంలో తప్పేం లేనప్పటికీ అది హద్దులు దాటి అవతలి వాళ్ళని అవమానించే వరకు వెళ్లడంతో పోలీసులు అతి చేస్తున్నారని వరకు వ్యవహారం వెళ్లింది..