తెలంగాణలో పెండింగ్ ఛలాన్‌లు క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన డిస్కౌంట్ విధానానికి భారీ ఎత్తున స్పందన వస్తోంది. దీంతో తొలిరోజే 5 లక్షల ట్రాఫిక్ ఛలాన్‌లు క్లియర్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఏకంగా రూ.600 కోట్ల పై చిలుకు ట్రాఫిక్ ఛలాన్‌లు పేరుకుపోయి ఉన్నాయి. అందుకే ట్రాఫిక్ పోలీసులు రిబేట్ ప్రకటించారు. అయితే తొలి రోజు లక్ష నుంచి 3 లక్షల మంది వరకు వాహనదారులు ట్రాఫిక్ ఛలాన్‌లు…
ఏపీలో వాహనదారులపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ఇకపై ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానాతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేయడానికి వీలుంటుంది. కారులో వెళ్లేవారు సీటు బెల్ట్ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా కట్టాల్సి ఉంటుంది. అర్హత లేని వారికి డ్రైవింగ్ చేసే అవకాశం ఇస్తే రూ.5వేలు ఫైన్ పడుతుంది. ఇలా ట్రాఫిక్ జరిమానాలను భారీగా ఏపీ ప్రభుత్వం పెంచేసింది. ఈ నిబంధనలపై గతంలోనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…
తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఏడాది జరిమానాల రూపంలో ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ ఏడాదిలో ఇప్పటిరకు రూ.533కోట్ల జరిమనాను పోలీసులు విధించారు. అంటే రోజుకు రూ. కోటిన్నర చొప్పున వసూలు చేశారు. Read Also: అంకుల్ అని పిలిచిన యువతి.. కోపంతో ఆ వ్యక్తి చేసిన పనికి… అయితే ట్రాఫిక్ ఛలానాలలో ఎక్కువగా హెల్మెట్ ధరించనందుకు విధించిన జరిమానాలే ఉన్నాయి. హెల్మెట్‌లు…
ట్రాఫిక్ రూల్స్ వాహనదారులకు షాకిస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే… ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వారికి కూడా కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 చలాన్లు పెండింగ్ లో ఉన్న వాహనదారులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు 10 చలాన్ల కంటే ఎక్కువ ఉంటే వారిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ట్రైనిగ్ ఇనిస్టిట్యూట్ కు పోలీసులు పంపిస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ లో ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘటనలకు…
దేశవ్యాప్తంగా రోజురోజుకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి జాబితా పెరిగిపోతోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు కేటుగాళ్లు మాత్రం ట్రాఫిక్ నియమాలను పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ జంట ఫోటోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల విభాగం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సదరు ఫోటోలో బైక్ వెనుక కూర్చున్న మహిళ తన తలకు హెల్మెట్ ధరించడానికి బదులు పాలిథిన్ కవర్‌ను చుట్టుకుంది. Read Also: ఖేల్…
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారుల పెండింగ్ చలాన్లపై 50 శాతం రాయితీ ఆఫర్ తీసుకొచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఏకంగా ఒకేసారి 50 శాతం డిస్కౌంట్ అంటూ చూసిన హైదరాబాదీలు.. దానిని విపరీతంగా షేర్ చేస్తూ, లైక్‌లతో వైరల్ చేశారు.. అక్టోబర్ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ చలాన్లు చెల్లించవచ్చని కేటుగాళ్లు క్రియేట్ చేసిన వార్తపై క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్…
ట్రాఫిక్ చలానాలు ఇప్పుడు సామాన్యులను భారంగా మారుతున్నాయి… వరుసగా వస్తున్న ట్రాఫిక్ చలానాలు భరించలేక ఓ యువకుడు ఏకంగా తన బైక్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టడం కలకలం సృష్టిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన తలారి రత్నప్ప తనయుడు సంగప్పకు టీఎస్ 34 డీ 2183 నంబర్ గల బైక్ ఉంది.. ఆ ద్విచక్రవాహనంపై 5,500 రూపాయలు చలానాగా ఉంది. బైక్ పై కూలి పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాలకు…