Huge Demand for Kosa Meat: సంక్రాంతి పండుగ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో పందెం కోళ్లకు అనూహ్యమైన డిమాండ్ నెలకొంది. పందాల బరిలో ఓడిపోయిన కోళ్లు ఇప్పుడు కోస మాంసం రూపంలో భారీగా అమ్ముడుపోతున్నాయి. పందెం కోళ్ల మాంసం రుచిగా, పౌష్టికంగా ఉంటుందనే నమ్మకంతో జనం ఎగబడుతున్నారు. పందెం కోసం నెలల తరబడి కోళ్లను ప్రత్యేకంగా పెంచుతారు నిర్వాహకులు. బలమైన ఆహారం, వ్యాయామంతో కోడిని తీర్చిదిద్దుతారు. అయితే బరిలో ఓడిపోయిన కోళ్లకు ఇప్పుడు కొత్త గుర్తింపు వచ్చింది.…