ఈమధ్యకాలంలో ప్రజాప్రతినిధులు కొందరు ప్రజలతో మమేకం అవుతున్నారు. ఆనందంగా డ్యాన్స్ లు వేస్తున్నారు. తాజాగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డప్పుతో దరువేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. వికారాబాద్ జిల్లాలోని ధారూర్ మండలం అంపల్లి గ్రామంలో ఒగ్గుడోలు శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఒగ్గు కళాకారులతో కలిసి డోలు వాయించి దరువేశారు. కళాకారులతో పాటు ఆయన కూడా డప్పుతో చిందులేసి సందడి చేశారు. దీంతో అక్కడ ఉన్న వారంతా కేకలు…