సిట్ కార్యాలయం వద్ద పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఇవాళ 11 గంటలకు సిట్ ఎదుట పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. పేపర్ లీక్ పై తన ఆరోపణల పట్ల ఆధారాలను సమర్పించాలని రేవంత్ కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్‌సే హాత్‌జోడో పాదయాత్ర నిజామాబాద్ నియోజక వర్గంలో కొనసాగతుంది. నేడు ఆర్మూర్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు.
మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. టైం, డేట్ కేటీఆర్ ఖరారు చేయాలని, ప్రజల మధ్య తేల్చుకుందాం రేవంత్ అన్నారు. కేటీఆర్ ఎక్కడ చెబితే అక్కడ చర్చకు నేను రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర కొనసాగుతుంది. నేడు జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ చిట్యాల, మొగుళ్ళపల్లి మండలాల్లో హాథ్ సే హాథ్ జోడో యాత్ర సాగనుంది.
Bhatti Vikramarka: ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. సచివాలయం ప్రారంభం అనంతరమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశం ఉందంటూ ప్రచారం జోరుగా ఉంది..
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. భద్రాద్రి-ఇల్లందులో హత్ సే హత్ జోడో పాదయాత్రలో భాగంగా జె.కె. ఓ.సిలో ఐ.ఎన్.టి.యు.సి జెండాను ఆవిష్కరించి పిట్ మీటింగ్ లో పాల్గొన్నారు.
నేను సైగ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని మహబూబ్ బాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఒక రోగ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పై ఇష్టం వచ్చినట్లు రేవంత్ మాట్లాడారని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చానని, హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. 20 శాతం మైనార్టీలు, 80శాతం మెజార్టీలను విభజించి పాలించిన విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
హత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా రేవంత్ పాదయాత్ర ఇవాల్టితో షురూ కానుంది. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఇంటి నుంచి పాదయాత్రకి బయలుదేరిన రేవంత్ ను కూతురు నైనిషా హారతి ఇచ్చారు.
Revanthreddy : గవర్నర్ వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కాదని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతికి రాష్ట్రానికి వారధిలా గవర్నర్ ఉంటారని ఆయన తెలిపారు.