ముచ్చింతల్ లోని శ్రీరామానుజుల విగ్రహ ప్రాంగణానికి వీఐపీల తాకిడి ఎక్కువయింది. సమసమాజ నిర్మాత శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాల ఏర్పాట్లు శంషాబాద్ మండలం ముచ్చింతల్ చినజీయర్‌స్వామి ఆశ్రమంలో వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ముచ్చింతల్‌లో ఫిబ్రవరి 5వ తేదీన నరేంద్రమోదీ పర్యటన ఖరారైనట్లు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆశ్రమానికి సమాచారం అందింది. రూ.వెయ్యి కోట్లతో రూపుదిద్దుకుంటున్న 216 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ఫిబ్రవరి 5వ తేదీన ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు.…