న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. న్యూజిలాండ్ 107 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా సాధించింది. దీంతో.. 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్నందుకుంది. గెలుపు అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టాస్ ఓడిపోవడం వల్లే భారత్‌తో తొలి టెస్ట్‌లో విజయం సాధించామని అన్నాడు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని తెలిపాడు.