తెలంగాణ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్ (TOSS)కి సంబంధించిన దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించి అర్హులైన వ్యక్తులు పథకం పొందేందుకు న్యాయం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఇక్కడ అధికారులను ఆదేశించారు. ఎస్సీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు పథకాలపై సమీక్షించేందుకు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు అర్హులైన వారికి రూ.20 లక్షలు ఇస్తోందన్నారు. అన్ని వర్గాల పేద…