వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాజ్యసభ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది.. మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పేర్లు ఫైనల్ చేశారు.. అయితే, ఇవాళ అధికారికంగా వైసీపీ అధిష్టానం ప్రకటించనుంది.. ఇక, సీఎం వైఎస్ జగన్ ను కలిసి కృతజ్ఞతలు…
అన్నయ్య మూసేస్తే తమ్ముడొచ్చాడు.. మంత్రి తీవ్ర విమర్శలు.. ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. కాగా అధికార వైసీపీ పార్టీ.. సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తుంటే.. టీడీపీ, జనసేన కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో.. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి చెల్లుబోయిన వేణు మండిపడ్డారు. చిరంజీవి పార్టీ…
మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజక వర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలుపు ఓటములు హుందాగా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ఒక దిగజారుడు పార్టీ. వెకిలి చేష్టలతో వికృతానందం పొందుతుందన్నారు. ఓడిన వాళ్లపై దుష్ప్రచారం చేయడం కుసంస్కారమన్నారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య స్ఫూర్తి కనుమరుగై పోయిందన్నారు. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేసామని రెండు నెలల్లోనే ప్రజలు బాధపడే దుస్థితికి కాంగ్రెస్ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన…
అసెంబ్లీ వద్ద సందడి.. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు తుంటికి ఆపరేషన్ నుంచి కోలుకుని ఈరోజు తెలంగాణ శాసనసభకు వచ్చారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అసెంబ్లీ ఆవరణలోని ప్రతిపక్ష నేత ఛాంబర్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించారు.…
సౌత్ కొరియా తీరం వద్ద కూలిన అమెరికా యుద్ధ విమానం.. దక్షిణ కొరియా తీరంలో అమెరికా యుద్ధ విమానం ఎఫ్-16 కూలింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆ విమాన పైలెట్ సేఫ్ గా బయట పడ్డారు. కేవలం నెలన్నర సమయంలో కొరియా తీరంలో ఎఫ్-16 యుద్ధ విమానం కూలడం ఇది సెకండ్ టైమ్. గత ఏడాది డిసెంబర్లో కూడా ఓ యుద్ధ విమానం కూడా ఇక్కడే కూలిపోయింది. 8వ ఫైటర్ వింగ్‌కు చెందిన ఎఫ్-16 ఫైటింగ్…
సిరిసిల్ల నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జివో తెస్తాం..! రాజన్న సిరిసిల్ల నేత కార్మికులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జివో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్లను డెవలప్మెంట్ చేయడానికి రేడీగా ఉన్నామన్నారు. బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇవ్వమని మా మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు.…
రేపు స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు.. వారి హాజరు పై ఉత్కంఠ..! రేపు(సోమవారం) స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు అంశం రానుంది. కాగా.. వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు పై ఉత్కంఠ నెలకొంది. రేపటి విచారణకు ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరుకానుండగా.. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో.. రేపటి విచారణకు హాజరు కాలేనని స్పీకర్ కార్యాలయంకు సమాచారం ఇచ్చారు. ఫిబ్రవరి రెండో తేదీన విచారణకు హాజరు…
జీవన్ రెడ్డి గారు మీ వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు.. కవిత కౌంటర్ జీవన్ రెడ్డి గారు మీ వైఖరి ఎక్కువ రోజలు నిలబడదు ప్రజలు తిరగబడతారని ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ సర్పంచ్ ని జగిత్యాల జైలులో కవిత పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. హబ్సిపూర్ సర్పంచ్ పై కక్షపూరితంగా వ్యవహరించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేసు పెట్టించారని మండిపడ్డారు. జగిత్యాలలో 30 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఎమ్మెల్యే సంజయ్ చేశారని…