నేడు కాకినాడ జిల్లాలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర. సాయంత్రం అచ్చంపేట జంక్షన్లో బహిరంగ సభ. బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్. తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,790 లుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,640 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.89,900 లుగా ఉంది. నేటి నుంచి 24 వరకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.…
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 38 మందికి గాయాలు ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో బస్సు ఫ్లై ఓవర్‌పై నుంచి పడిపోవడంతో ఐదుగురు మృతి చెందగా, 38 మంది గాయపడ్డారు. గాయపడిన వారి సంఖ్యను జాజ్‌పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ధృవీకరించారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. క్షతగాత్రులను కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ, జాజ్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా బారాబతి సమీపంలో…
నేడు సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్. ఉదయం 9 గంటలకు నారాయణపురం నుంచి ప్రారంభం. గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ దగ్గర సభ. మధ్యాహ్నం 3.30 కి సీఎం జగన్ బహిరంగ సభ. పిప్పర, పెరవలి, సిద్దాంతం క్రాస్ మీదుగా ఈతకోటకు చేరుకోనున్న సీఎం జగన్. నేడు బీహార్‌లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం. గయా గాంధీ మైదాన్‌లో ప్రధాని మోడీ బహిరంగ సభ. పూర్నియాలో ప్రధాని మోడీ ర్యాలీ, బహిరంగ సభ. నేడు…
రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు సీఎం కావటం చారిత్రక అవసరం గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు వెలమ కుటుంబ సభ్యులు మద్దతు తెలిపారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి వెలమ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం చారిత్రక అవసరం అన్నారు. చంద్రబాబుకు గన్నవరం…
సీఎం జగన్‌పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయవాడ నగరంలో ‘మేమంతా సిద్ధం’ రోడ్‌షో నిర్వహిస్తుండగా శనివారం రాత్రి సింగ్‌నగర్ డాబా కొట్ల రోడ్డులో రాయి తగిలి సీఎం నుదుటిపై గాయమైన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన ప్రాంతంలో అనుమానితుల కదలికలపై స్థానికుల నుంచి స్టేట్ మెంట్లు రికార్డ్ చేసిన పోలీసులు.. గత వారం రోజులుగా పదే పదే…
మళ్లీ సీఎం జగన్ బస్సుయాత్ర షురూ.. ఎప్పటినుంచంటే..?! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనపై జరిగిన దాడి తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల నేపథంలో భాగంగా మళ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలుపెట్టబోతున్నారు సీఎం. శనివారం నాడు జరిగిన దాడిలో సీఎం జగన్ పై ఓ గుతూ తెలియని ఆగంతకుడు రాయి విసిరిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయనకు కంటి పై భాగంలో చిన్నపాటి గాయం కారణంగా నేడు విశ్రాంతి తీసుకున్నారు.…
అంబేద్కర్ ఆశయాలకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. అంబేద్కర్ ఆశయాలకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఓ.బి.సి మోర్చ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీనర్గాలు, దళితులు, ఆదివాసుల అభ్యున్నతి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా మోది చేస్తున్న…
అమరావతి నిర్మించింది.. ఆంధ్రాకు సాప్ట్‌వేర్‌ను పరిచయం చేసింది.. అందుకోసమే..! ప్రజాగళం 32వ సభ గుంటూరు జిల్లాలోని తాడికొండలో జరుగుతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ ఇది తాడికొండ కాదు రాష్ట్ర రాజధాని అమరావతి.. అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను.. ఈ రాజధానిని ఈ అమరావతిని ఒక వెంట్రుక కూడా ఎవరు కదిలించలేరు.. ఈరోజు ఏప్రిల్ 13.. మే 13న చరిత్ర తిరగబడుతుంది.. ప్రజలు రాసిన చరిత్ర మిగులుతుంది.. తెలుగువాడు గర్వపడేలా రాజధాని ఉండాలని…
“స్కాన్ చేసి స్కామ్ చూడండి”.. బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు.. లోక్‌సభ పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తమిళనాడులో అధికార డీఎంకే వర్సెస్ బీజేపీలా రాజకీయం నడుస్తోంది. ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా తమిళనాట బీజేపీ టార్గెట్‌గా పోస్టర్ల ప్రచారం జరుగుతోంది. మోడీ ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా పలు చోట్ల ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ‘స్కాన్ చేసి స్కామ్‌లని చూడండి’ అంటూ పోస్టర్లపై రాసి ఉంది.…