ముగిసిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాదులోని కవిత నివాసంలో కొద్దిసేపటి కిందట విచారణ ముగిసింది. ఈ ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను ప్రశ్నించిన సీబీఐ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది. లిక్కర్ స్కాంలో సాక్షిగా కవిత వాంగ్మూలం నమోదు చేసింది. నేటి విచారణలో ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం పాల్గొంది. లిక్కర్…
రేపు ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్.. ఈనెల 14న బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు(సోమవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 14న బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన రేపు రాజధానికి పయనం కానున్నారు. ఢిల్లీలో డిసెంబర్ 14న ఎస్పీ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారభించనున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని , జాతీయ కార్యవర్గాన్ని అదే రోజు ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందుగానే మంత్రి నిరంజన్ రెడ్డి,…