తన క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన పవన్..పంచాయతీ రాజ్ శాఖ వ్యవహరాలపై ఆరా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్‌కి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తన క్యాంప్ ఆఫీసులో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. పంచాయతీ రాజ్ శాఖ…
జమ్మూ & కాశ్మీర్‌కు బీజేపీ ఇంచార్జ్ గా కిషన్ రెడ్డి.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి సోమవారం జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇంఛార్జిగా నియమితులయ్యారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ తో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా పార్టీ ఎన్నికల ఇంచార్జ్‌లు, కో – ఇన్చార్జ్ లను నియమించారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, జమ్మూ కాశ్మీర్లో సెప్టెంబర్…
ఇందిరాగాంధీని “భారతమాత” అన్న వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వివరణ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని “భారతమాత” అని కేంద్రమంత్రి సురేష్ గోపీ శనివారం వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో.. ఆ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీకి ‘తల్లి’ అని అన్నానని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఈరోజు మీడియాకు తెలిపారు. తాను హృదయపూర్వకంగా మాట్లాడే వ్యక్తినని.. ఇందిరా గాంధీ గురించి తాను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని అన్నారు. ఎవరికీ నచ్చినా, నచ్చకపోయినా… కేరళలో…
మోడీ, అమిత్ షాపై సంచలన ఆరోపణలు మోడీ, అమిత్ షాపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. స్టాక్ మార్కెట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. స్టాక్ మార్కెట్ల స్కామ్‌పై జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జూన్3న స్టాక్ మార్కెట్లు పెరుగుతాయని హోంమంత్రి చెప్పారని.. ఈ విషయం ఆయనకు ఎలా తెలుసని ప్రశ్నించారు. ఇది స్టాక్ మార్కెట్లో అత్యంత పెద్ద స్కామ్ అని చెప్పుకొచ్చారు.…
జూన్ 8న మోడీ ప్రమాణస్వీకారం..‘8’వ తేదీనే ఎందుకు.? కారణం ఇదే.. ఇక లాంఛనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారం చేపట్టబోతోంది. నరేంద్రమోడీ వరసగా మూడోసారి దేశ ప్రధాని కాబోతున్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఈ రికార్డును పునరావృతం చేస్తున్నది మోడీ మాత్రమే. ఈరోజు మోడీ నివాసంలో ఎన్డీయే నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జేడీయూ నేత నితీష్…
ఫ్లైట్ డోర్ తెరిచేందుకు యత్నం.. కేరళ వ్యక్తి అరెస్ట్ ఈ మధ్య విమానాల్లో ప్రయాణికులు తిక్క తిక్క పనులు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. కొంత మంది చిల్లరగా ప్రవర్తించి.. మరికొందరు తొటి ప్రయాణికుల పట్ల అమర్యాదగా ప్రవర్తించి జైలు పాలవుతుంటే.. తాజాగా ఒక ప్యాసింజర్ ఏకంగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించి అరెస్ట్ పాలయ్యాడు. ఈ ఘటన ముంబై ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. కేరళలోని కోజికోడ్ నుంచి బహ్రెయిన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ప్రయాణికుడు రచ్చ…
మెగాస్టార్ చిరంజీవికి గోల్డెన్ వీసా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవికి తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి చెందిన కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్ మెంట్ గోల్డెన్ వీసా ఇచ్చింది. ఎమిరేట్స్ ఫస్ట్ సంస్థ ద్వారా ఈ గోల్డెన్ వీసా ఇచ్చినట్టు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు, బాలీవుడ్ సహా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలకు కూడా UAE ప్రభుత్వం గోల్డెన్…
నోరుజారిన నితీష్ కుమార్.. “మోడీ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ”.. జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ నోరు జారారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అనుకోకుండా ప్రధాని నరేంద్రమోడీ మళ్లీ ‘ముఖ్యమంత్రి’ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పాట్నాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ మేము భారత్ అంతటా 400 సీట్లకు పై గెలవాలని అనుకుంటున్నాము. నరేంద్ర మోడీ మళ్లీ…