కోల్‌కతా హాస్పిటల్ దాడి బీజేపీ, లెఫ్ట్ పార్టీల పనే.. కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపలనకు కారణమైంది. మమతా బెనర్జీ సర్కారుపై బీజేపీ, లెఫ్ట్ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. గత వారం కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగింది. మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై సంజయ్ రాయ్ అనే వ్యక్తిని దారుణానికి ఒడిగట్టానే ఆరోపణల్ని…
డాక్టర్ల నిరసనకు గవర్నర్ సంఘీభావం.. ఆస్పత్రి దగ్గరకు వెళ్లి మద్దతు కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన ఓ వైపు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంకోవైపు బుధవారం అర్ధరాత్రి వందలాది మంది అల్లరి మూకలు ఆర్జీ కర్ ఆస్పత్రిలోకి ప్రవేశించి సాక్ష్యాలను చెరిపివేయడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇదంతా చేయిస్తోందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఉద్దేశ పూర్వకంగా ఆనవాళ్లు…
“నిందితులను రక్షించే ప్రయత్నం”.. కోల్‌కతా డాక్టర్ ఘటనలో మిత్రపక్షంపై విమర్శలు.. కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై కాంగ్రెస్ నేతలు మెల్లిగా స్పందిస్తున్నారు. ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించిన ఒక రోజు తర్వాత ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా స్పందించారు. మిత్రపక్షం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సుతిమెత్తగా విమర్శలు చేశారు. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘బాధితురాలికి న్యాయం చేయడానికి బదులుగా నిందితులను రక్షించే…
“వక్ఫ్ బిల్లు”పై పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్‌గా జగదాంబికా పాల్ నియామకం.. వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాలని’ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లుని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగంపై దాడిగా, మతస్వేచ్ఛని హరిస్తున్నాయంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఈ బిల్లుపై ఆందోళన చేశాయి. దీంతో ఈ బిల్లుని చర్చించేందుకు ‘‘ జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ని నియమించింది. 21 మంది అధికార, ప్రతిపక్షకు చెందిన లోక్‌సభ ఎంపీలను, 10…
వేణు స్వామిపై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన టీఎఫ్జేఏ నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం పైన వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఫిల్మ్ సెలబ్రిటీస్‌పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో పెనుధుమారం లేపింది. వ్యక్తిగత విషయాలు నలుగురిలో మాట్లాడకూడదు అనే ఇంగిత…
కాంగ్రెస్, బీఆర్ఎస్ మొదటినుంచి తోడు దొంగల పార్టీలు.. సంగారెడ్డిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, BJYM జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లి కేటీఆర్ తో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాడేమో..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మొదటినుంచి తోడు దొంగల పార్టీ..నాణానికి బొమ్మ బొరుసు ఈ…
మేయర్ వీడియోస్ మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) మేయర్ గద్వాల్ విజలక్ష్మి, తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కించపరిచేలా వీడియోను రూపొందించి, ప్రచారం చేసినందుకు గాను ఓ ఫోటోగ్రాఫర్‌ను ఆగస్టు 10వ తేదీ శనివారం నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఉప్పల్ సమీపంలోని పీర్జాదిగూడలో నివాసం ఉంటున్న 29 ఏళ్ల చామకూరి లక్ష్మణ్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతను…
బంగ్లాదేశ్ ప్రధాని తండ్రి షేక్ ముజ్బిర్ రెహ్మాన్ విగ్రహం ధ్వంసం..! బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, షేక్ హసీనా తండ్రి.. షేక్ ముజ్బిర్ రెహ్మాన్ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వేల సంఖ్యలో యువత రోడ్ల మీదకు వచ్చిన పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దేశ రాజధాని ఢాకాలో ఉన్న ప్రధాని ప్యాలెస్‌లోకి ప్రవేశించడంతో పాటు అక్కడ ఉన్న వస్తువులను పూర్తిగా నాశనం చేశారు. అలాగే, ఢాకా వీధుల్లో జెండాలతో…