ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. పోలవరం నిధులు, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రధానికి వినతిపత్రం ఇవ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణ…