రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధించిన ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.. రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఇక, జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రాజ్, మున్సిపల్, మార్జిన్లకు నిబంధనలు వర్తింపజేయనున్నారు.. ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. రోడ్లకు దూరంగా ప్రజలకు…
వైకుంఠ ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు వైకుంఠ ఏకాదశి వేళ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు.. వైష్ణవాలయాలు తెల్లవారుజామునుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలైన తిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి, రెండు రాష్ట్రాల్లోని టీటీడీ ఆలయాలు సహా అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీ ఏర్పడింది.. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి…