కూల్ కూల్‌గా ప్రయాణం.. ఆర్టీసీలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు టీఎస్ఆర్టీసీ హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ అంతటా ప్రజలకు క్లీనర్, మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు పనులు మొదలు పెట్టింది. వచ్చే నెల నుండి హైటెక్ ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ బస్సులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు జరుగుతున్నాయి. సోమవారం బస్‌భవన్‌లో టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ బస్‌భవన్‌లో ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల తొలి నమూనాలను పరిశీలించి, ప్రయాణికులకు అందించే సౌకర్యాలపై అధికారులతో సవివరంగా చర్చించారు.…