Hyderabad Tops India: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. దేశంలోని టాప్-8 సిటీల్లో అగ్రస్థానంలో నిలిచింది. అది కూడా గ్రేడ్-ఎ కేటగిరీలో కావటం విశేషం. షామింగ్ మాల్స్‌లో లీజుకి ఇచ్చే విస్తీర్ణం(గ్రాస్ లీజబుల్ ఏరియా-జీఎల్‌ఏ)ను ప్రతిపదికగా తీసుకొని ఒక జాబితా రూపొందించారు. 5 లక్షలకు పైగా చదరపు అడుగుల జీఎల్‌ఏ కలిగిన షాపింగ్ మాల్స్, అవి ఉన్న నగరాలను గ్రేడ్-ఎలో చేర్చారు.