యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఈరోజు ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, టీజర్లోని సీన్స్, ప్రభాస్ చెప్తున్న ఒక్కో డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే 100కే లైక్స్…