రోజులో ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం మితంగా తినడం ఎంత అవసరమో, ఆలోచనలు సహజమైనప్పటికీ అధిక ఆలోచనలు మానసిక ఒత్తిడికి దారితీసినట్లే, నిద్ర విషయంలో కూడా పరిమితిని అధిగమించడం శారీరక పనితీరుపై ప్రతికూల ప్రభావాలు చూపుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. నిద్రలేమి ఎలా హానికరమో, అలాగే అతి నిద్ర కూడా అంతే ప్రమాదకరమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా పెద్దలు రోజుకు 7–8 గంటలు నిద్రపోతే సరిపోతుంది. అయితే ప్రతిరోజూ 9 గంటలకంటే ఎక్కువ…