Lancet Warns About 'Tomato Flu' In India: ఇప్పటికే ఇండియా రకరకాల వైరస్ వ్యాధులతో బాధపడుతోంది. కోవిడ్ ఎలాగూ గత రెండున్నరేళ్ల నుంచి దేశంలోని ప్రజలకు సోకుతూనే ఉంది. తాజాగా మంకీపాక్స్ కేసులు కూడా ఇండియాలో నమోదు అయ్యాయి. దీంతో పాటు అక్కడక్కడ స్వైన్ ఫ్లూ వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కొత్త వైరస్ వ్యాధి పట్ల భారతదేశం అప్రమత్తంగా ఉండాలని లాన్సెట్ రెసపిరేటరీ జర్నల్ తన నివేదికలో హెచ్చరించింది.