చూడముచ్చటైన జంట అంటూ వేనోళ్ళ కీర్తించిన నాగచైతన్య, సమంత జంట విడాకులు తీసుకుంది. గత కొద్ది రోజులుగా చైతూ, సామ్ విడిపోతారని వినిపిస్తూనే ఉంది. అయితే శనివారం అధికారికంగా వారిద్దరూ విడిపోయినట్టు నాగచైతన్య తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నాడు. ఆ వెంటనే సమంత సైతం తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. టాలీవుడ్ ఓ స్టార్ జంట విడిపోవడం కొత్తేమీ కాదు. సినిమా జంటలు పెళ్ళయ్యాక బ్రేకప్ అయినవి కొన్ని అయితే, కొందరు వివాహ…