టాలీవుడ్‌లో పండుగ సీజన్ అంటేనే సినిమాల పండుగ అని చెప్పాలి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ప్రేక్షకులు థియేటర్ల వైపు పరుగులు తీస్తారు. ఆ క్రేజ్ దృష్ట్యా పెద్ద హీరోలు, స్టార్ డైరెక్టర్లు, ప్రముఖ బ్యానర్లు అన్నీ ఈ సీజన్‌లోనే తమ సినిమాలను రిలీజ్ చేయాలని చూస్తుంటారు. కానీ ఇలాంటి హై వాల్యూ సీజన్‌లో ఎక్కువ సినిమాలు ఒకేసారి వస్తే అవి ఒకదానితో ఒకటి క్లాష్ అవ్వడం తప్పదు. అలాంటి క్లాష్‌లలోనే ఇప్పటికీ మర్చిపోలేని ఘట్టం 2004 సంక్రాంతి…