(ఎస్. గోపాల్ రెడ్డి 77వ జయంతి) అన్నపూర్ణ, సురేశ్, జగపతి వంటి నిర్మాణ సంస్థల సరసన నిలిచిన పతాకం భార్గవ్ ఆర్ట్స్. వినోద ప్రధానమైన కథాబలం ఉన్న చిత్రాలను నిర్మించి, తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి. నేడు ఆయన జయంతి. నెల్లూరు జిల్లా గుణపాటి పాలెంలో ఎస్. గోపాల్ రెడ్డి జూలై 1,1944లో జన్మించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీలో బి.ఎస్.సి. పట్టా…