తన పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ఆ నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. అప్పటి నుంచీ ఆయన పుట్టినరోజయిన సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా గురుపూజ్యోత్సం సాగుతోంది. చిత్రసీమలోనూ ఈ సంప్రదాయం కొనసాగేది. తెలుగు సినిమా రంగంలో గురువు అన్న పదం వినగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది దర్శకరత్న దాసరి నారాయణరావే. ఆయన శిష్యప్రశిష్యులు ఈ నాటికీ చిత్రసీమలో దర్శకులుగా వెలుగొందుతూనే ఉన్నారు. తమను సినిమా రంగానికి పరిచయం చేసిన వారిని, ఎక్కువ అవకాశాలు కల్పించిన…