Srinivasa Rao: గత పదేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ అదుపు తప్పిందని సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. గిల్డ్ పేరుతో కొంతమంది నిర్మాతలు కలిసి స్వార్థపూరితంగా వ్యవహరించడమే ఇందుకు ప్రధాన కారణమని ఆరోపించారు. వచ్చే ఆదివారం జరగనున్న తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికల నేపథ్యంలో తమ ప్యానెల్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గిల్డ్ సభ్యుల వల్లే ఈ ఏడాది సినిమా షూటింగ్‌లు…