గత 18 రోజులు గా జరిగిన సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు పడింది. అనేక చర్చలు, వాదనలు, సవాల్ లతో గత పద్దెనిమిది రోజులుగా జరుగుతున్న టాలీవుడ్ సమ్మె విషయంలో చివరికి తెలంగాణ ప్రభుత్వం చొరవతో అందరికి ఆమోదయోగ్యమైన ఫలితం వచ్చింది. నిర్మాతలు , ఫెడరేషన్ నాయకుల తో కార్మికశాఖ అదనపు కమిషనర్ జరిపిన చర్చలు చర్చలు విజయవంతం అయ్యాయి. రెండు వేల లోపు కార్మికులకు మూడు సంవత్సరాలకు 22.5 శాతం వేతనాలు పెంచేలా నిర్ణయించారు.…