యంగ్ బ్యూటీ శ్రీలీల వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా, ఆమెకు ఆశించిన స్థాయి బ్లాక్‌బస్టర్ మాత్రం ఇంకా అందలేదు. అయితే కెరీర్ గ్రాఫ్‌ను సెట్ చేసుకునే ప్రయత్నంలో, ప్రతి ప్రాజెక్ట్‌ను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తోంది. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధం కావడంతో, టాలీవుడ్–కోలీవుడ్ ఆడియన్స్ రెండింటి దృష్టి కూడా ఈ సినిమాపై ఉంది. Also…
అనతి కాలంలోనే టాలీవుడ్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్‌గా ఎదుగిన శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా తనకు నచ్చిన కథలు, పాత్రలను ఎంచుకుంటూ తనదైన దారిలో ముందుకు సాగుతోంది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్”లో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బ్యూటీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే, ఆమె కెరీర్ మరో స్థాయికి చేరుకుంటుంది.…