Sreeleela : పెళ్లి విషయంలో శ్రీలీల ఓపెన్ కామెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనతి కాలంలోనే టాలీవుడ్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్‌గా ఎదుగిన శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా తనకు నచ్చిన కథలు, పాత్రలను ఎంచుకుంటూ తనదైన దారిలో ముందుకు సాగుతోంది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్”లో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బ్యూటీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే, ఆమె కెరీర్ మరో స్థాయికి చేరుకుంటుంది. అలాగే రవితేజ హీరోగా వస్తున్న “మాస్ జాతర” చిత్రంలో కూడా శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తోంది. ఇలా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, శ్రీ లీల తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో తరచూ పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన కాబోయే భర్తలో కావాల్సిన లక్షణాలు గురించి చాలా స్పష్టంగా మాట్లాడింది.
Also Read: Prabhas : ‘ఫౌజీ’తో తెలుగులోకి అడుగుపెడుతున్న కన్నడ బ్యూటీ..
Also Read
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్‌లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
“నాకు కాబోయే వ్యక్తి అందంగా లేకపోయినా పర్వాలేదు కానీ, నన్ను అర్థం చేసుకునే మనసున్న వ్యక్తి కావాలి. నా సినీ కెరీర్ పట్ల గౌరవంగా ఉండి, ప్రేమతో నన్ను ప్రోత్సహించి, సరదాగా ఉండే, నిజాయితీ గల వ్యక్తి నా జీవితం లోకి వస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటా” అని స్పష్టం చేసింది శ్రీ లీల. అదే సమయంలో తాను ఇటీవల కొంతమంది దర్శకుల ఆఫర్లను తిరస్కరించడం వెనుక కారణం గురించి కూడా వివరించింది. “కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నా. అలాంటి మంచి పాత్ర దొరికితే ఎలాంటి సినిమాలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నాను” అంటూ చెప్పింది.
ప్రజంట్ శ్రీలీల చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ఆమె నిజాయితీని, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తున్నారు. కొందరు “ఇది ప్రేమలో ఉన్న సంకేతమేమో?” అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా, తన స్పష్టమైన ఆలోచనలతో, ఆత్మవిశ్వాసంతో, నిజాయితీతో మాట్లాడే శ్రీ లీల మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. కెరీర్‌లో ఒక్కో అడుగు ముందుకేస్తూ, స్క్రీన్‌పైనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్న ఈ యంగ్ స్టార్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు