గత గురువారం (మార్చి 6)న అమెరికాలోని చికాగో నుండి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల చికాగో విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ కావాల్సి వచ్చింది. అందుకు గల సాంకేతిక కారణంపై విమానయాన సంస్థ వివరణ ఇచ్చింది. ఎయిర్ ఇండియా తన దర్యాప్తులో పాలిథిన్ సంచులు, గుడ్డలు, బట్టలు వంటి వాటిని విమానం టాయిలెట్లలోకి నెట్టడం వల్ల టాయిలెట్లు మూసుకుపోయాయని.. అవి నిరుపయోగంగా మారాయని ఎయిర్ ఇండియా తెలిపింది.