ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సర్వం సిద్దం చేశారు అధికారులు. కానీ.. విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎంసెట్ ప్రవేశ పరీక్షకు అనుమతించరని తేల్చిచెప్పింది. అయితే.. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిర్దిష్ట సమయానికన్నా ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం ప్రవేశ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అయితే.. ఈ పరీక్షలు ఈ నెల నేడు, రేపు, ఎల్లుండి (18, 19, 20) తేదీల్లో జరుగుతాయి. విద్యార్థులు మొత్తం 1,72,241…