కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఆ టైటిల్ కారణంగా అతను వివాదంలో చిక్కుకున్నాడు. ఆ టైటిల్ తన నుండి విశాల్ కొట్టేశాడంటూ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ ఆనంద్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు… స్టాలిన్ తనయుడు, నట నిర్మాత, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ దృష్టికి ఈ వివాదాన్ని తీసుకెళ్ళాడు. శరవణన్ అనే కొత్త దర్శకుడితో విశాల్ ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ మూవీ తీస్తున్నాడు. Read…