తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో గత 10-15 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్స్ పూర్తిగా నిండిపోయి.. వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న 88,257 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 45,068 మంది భక్తులు…
కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఇలా వచ్చే వారిలో కొంతమంది భక్తులు ముందే శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకుని వస్తే.. మరికొంతమంది భక్తులు నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలిపిరి నడక మార్గం నుంచే కాకుండా శ్రీవారి మెట్టు నుంచి కూడా తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే కఠిన శిక్షలు తప్పదని హెచ్చరించారు టీటీడీ పాలకమండలి సభ్యుడు శాంతారాం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు శాంతారాం, నరేష్ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషియల్ మీడియా టీటీడీపై దుష్ప్రచారం చేస్తోందని.. వాటిపై పాలకమండలిలో చర్చించి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూంటారు. ఇక, వికేండ్ లో భక్తుల తాకిడి ఎక్కువగా వుంటే.. వేసవి సెలవుల్లో అయితే భక్తుల తాకిడి మరింత ఎక్కువగా వుంటుంది. దీనితో సర్వదర్శనం భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివుండే సమయం కూడా అంతకంతకూ పెరుగుతుంది. టోకేన్ లేకుండా తిరుమల చేరుకునే సర్వదర్శనం భక్తులు స్వామివారి దర్శనభాగ్యం కోసం 24 గంటల సమయం వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Tirumala Darshanam: తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులతో తిరుమల మళ్లీ కిక్కిరిసి పోతోంది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వీటి వెలుపల కూడా వేలాది మంది భక్తులు క్యూలైనులో వేచి ఉన్నారు. సర్వదర్శనం పొందేందుకు భక్తులకు సుమారు 24 గంటల సమయం పడుతోంది. Read Also: CM Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబు గృహప్రవేశం..! నిన్న…
ఇవాళ లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు రిజిష్ర్టేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది.. ఇక, ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో భక్తులకు ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనుంది టీటీడీ..
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పిస్తామని బురిడీ కొట్టించే వారు రోజుకొకరు పెరిగిపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు భాద్యతలు చేపట్టిన సమయం నుంచి అధికారులు కేటుగాళ్ల భరతం పడుతున్నారు. భక్తుల ఫిర్యాదుల మేరకు అనతి కాలంలోనే పలువురిని విజిలెన్స్ పోలీసులు పట్టుకున్నారు. టీటీడీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కేటుగాళ్లు మాత్రం భక్తుల అమయాకత్వాన్ని క్యాష్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా శ్రీవారి దర్శనం పేరిట భక్తులను మోసం చేసిన ఘటన…
తిరుమలలో భక్తుల రద్దీ సాదారణంగానే ఉంది.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది టీటీడీ.. మే 15వ తేదీ నుంచి.. అంటే ఎల్లుండి నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు పునః ప్రారంభించనున్నట్టు టీటీడీ పేర్కొంది..
తిరుమలలో మరోసారి కలకలం రేగింది.. ఇవాళ ఉదయం నుంచి శ్రీవారి ఆలయం మీదుగా ఐదు విమానాలు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.. ప్రతి నిత్యం తిరుమల కొండ పై ఆలయానికి సమీపంలో తరుచూ విమానాలు వెళ్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు..
వేసవి సెలవుల సందర్భంగా శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది టీటీడీ.. సర్వదర్శనం భక్తులకు సులభతరంగా స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసింది.. శ్రీవారి వైకుంఠం కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండానే.. నేరుగా స్వామివారి దర్శనం కలిపిస్తున్నారు.. బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో.. సామాన్య భక్తులకు దర్శనాలు సులువుగా జరిగిపోతున్నాయి..