Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రికార్డు స్థాయిలో భక్తులకు దర్శనం కల్పించి టీటీడీ మరోసారి చరిత్ర సృష్టించింది. వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్న వేళ, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధారణ సామర్థ్యానికి అదనంగా 15 వేల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం నాటి లెక్కల ప్రకారం 83,032 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని పులకించిపోయారు. ఇది ఇటీవలి కాలంలో అత్యధిక దర్శన…