Tirumala Laddu Case: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో మరి కొందరి ప్రమేయంపై సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం ఆరా తీస్తుంది. గత రాత్రి అరెస్టు చేసిన నలుగురు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది.