తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందనే వార్తలపై జనసేన ఎంఎల్సీ నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘అసలు నేతిలో నెయ్యి లేకపోవడం ఏంట్రా.. అని అందరూ జుట్టు పీక్కుంటున్నారు కదా’ అంటూ ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.. ‘హిందూ ద్రోహి వైసీపీతో ఆడుకునే సెకండ్ ఇన్నింగ్స్ ఇది’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన నాగబాబు, గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘చిన్నప్పుడు మంత్రాలకు చింతకాయలు రాలతాయని వినేవాళ్లం. కొందరు సిద్ధులు నీళ్ల…