CM Chandrababu: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 2 వరకు కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరుఫున సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి ఎవరికి దక్కని భాగ్యాన్ని తనకు కల్పించారని సీఎం చంద్రబాబు అన్నారు. 14 సార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం కల్పించారని తెలిపారు. 22 సంవత్సరాల క్రితం వేంకటేశ్వర స్వామి ప్రాణబిక్ష పెట్టారని.. వేంకటేశ్వర స్వామి వారి ప్రాభల్యాని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లారన్నారు.
నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లే క్షేత్రం తిరుమల. తిరుమల క్షేత్రంలో ప్రతి నిత్యం నిత్యోత్సవాలు... ప్రతివారం వారోత్సవాలు... ప్రతి మాసం మాసోత్సవాలు.. నిర్వహిస్తూనే వుంటారు. స్వామివారికి సుప్రభాతం, తోమాలసేవ, అర్చన, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు..... విశేష పూజ , అష్టదళపాదపద్మారాధన, సహస్రకలషాభిషేకం, తిరుప్పావడ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు.....పుష్పయాగం, పవిత్రోత్సవం, ఆణివార ఆస్థానం, వసంతోత్సవం, జేష్ఠాభిషేకం, పార్వేటి ఉత్సవం, ప్రణయ కలహమహోత్సవం, పద్మావతి పరిణయోత్సవం వంటి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది టిటిడి. ఏడాది…
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందడి తిరుమలలో మొదలైంది. నేటి నుంచి అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంతో వార్షిక బ్రహ్మోత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లయింది. ఈ వేడుకలో భాగంగా, శ్రీవారి సేనాధిపతిగా భావించే విష్వక్సేనుల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.