దేశంలో ప్రస్తుతం జ్ఞానవాపీ మసీదు అంశం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్ట్ ఉత్తర్వుల మేరకు మే 14-16 వరకు మసీదులో వీడియో సర్వే నిర్వహించి మే 17న రిపోర్ట్ ఇవ్వాలని కోర్ట్ నియమించిన కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఈ రోజే వీడియోగ్రఫీ సర్వే వివరాలను కోర్ట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే జ్ఞానవాపీ మసీదులోని వజూ ఖానాలోని బావిలో శివలింగ భయటపడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీడియో సర్వేకు మరింత సమయం కావాలని కోర్ట్ కమిషనర్లు వారణాసి…