RBI-Card Tokenisation: కార్డ్ టోకెనైజేషన్ కోసం విధించిన డెడ్‌లైన్ రేపు శుక్రవారంతో ముగియనుంది. అయితే ఈ గడువును పొడిగించే ఆలోచన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లేనట్లు కనిపిస్తోంది. డెడ్‌లైన్ పొడిగించాలని చిన్న వ్యాపారుల నుంచి డిమాండ్లు వస్తున్నప్పటికీ కేంద్ర బ్యాంకు నుంచి మాత్రం అలాంటి సానుకూల సంకేతాలేవీ ఇప్పటివరకు వెలువడలేదు. కార్డ్ డేటాను భద్రపరచడానికి ఆర్బీఐ ఈ భారీ కసరత్తును మూడేళ్ల కిందటే ప్రారంభించింది.