హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో వరుసగా మూడు సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ 2024లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచులో మేఘాలయపై తిలక్ సెంచరీ చేశాడు. హైదరాబాద్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన తిలక్.. 67 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 151 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో చివరి…
IND vs SA Records: దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో అజేయంగా 107 పరుగులు, అభిషేక్ శర్మ 50 పరుగులతో భారత్ భారీ స్కోరు 219/6 చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా తరఫున మార్కో జాన్సెన్ అద్భుత ప్రదర్శన చేసాడు. అతడు కేవలం 17 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అయితే…
తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గురించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర విషయం చెప్పాడు. రెండో టీ20 అనంతరం తిలక్ తన వద్దకు వచ్చి.. మూడో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగుతానని చెప్పాడన్నాడు. తనను అడిగి మరీ ఛాన్స్ తీసుకున్న తిలక్.. సెంచరీతో సత్తా చాటాడని సూర్య తెలిపాడు. చివరివరకూ ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఆనందంగా ఉందన్నాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో…
తెలుగు తేజం, భారత్ యువ బ్యాటర్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లో నిలిచాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో తిలక్ సెంచరీ (107 నాటౌట్; 56 బంతుల్లో 8×4, 7×6) చేయడంతో ఈ ఫీట్ నమోదు చేశాడు. తిలక్ సెంచరీతో 14 ఏళ్ల సురేశ్ రైనా రికార్డు బద్దలైంది. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో…