బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు గాడితప్పడంతో ఆ ప్రభావం పొరుగు దేశాలపైన ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు.
బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఢిల్లీ చేరుకున్న షేక్ హసీనా.. లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఇవాళ అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పోలీసు కమిషనర్లు (సీఎస్‌పీ), పోలీసు సూపరింటెండెంట్‌లతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు.
అయోధ్య నగరమంతటా పోలీసులు పటిష్టమైన పహారా ఏర్పాటు చేశారు. ప్రాణ ప్రతిష్ట వేదిక దగ్గర, మందిరం చుట్టూ, మందిరానికి వంద మీటర్ల దూరంలో నలువైపులా పోలీసు అధికారులు, సిబ్బంది మఫ్టీలో గస్తీ కాస్తున్నారు. అలాగే, ఆలయం చుట్టూ కృత్రిమ మేథ(ఏఐ) ఆధారిత సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో భద్రత కోసం 11,000 మంది పోలీసులు, 40 బాంబ్ స్క్వాడ్‌లు, 10 కంపెనీల స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF), ఇతర భద్రతా దళాలు మోహరించనున్నారు. 14 రోజుల పాటు జరిగే రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20న ముగియనున్నాయి.
శాసనసభలో ఇటీవల జరిగిన పరిణామాలతో కొందరు ఎమ్మెల్యేలు , మంత్రి కొడాలి నానికి భద్రత పెంచింది ప్రభుత్వం. పౌరసరఫరాల మంత్రి కొడాలి నానికి ప్రస్తుతం ఉన్న 2+2 గన్ మెన్ల భద్రతో పాటు అదనంగా 1+4 గన్ మెన్ల భద్రత పెంచారు. ఆయన భద్రతకు 17మంది వుంటారు. కాన్వాయ్ లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ లకు ప్రస్తుతం ఉన్న 1+1 గన్…