ఆడియెన్స్ ని తెలుగు నిర్మాతలు ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారో చెప్పడానికి ఇదో ఉదాహరణ. కోట్లకు కోట్లు బడ్జెట్లు పెట్టేసి మాకు అంత అయింది ఇంత అయింది అని ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి సగటు సినిమా అభిమాని నడ్డి విరుస్తున్నారు తెలుగు నిర్మాతలు. ప్రభుత్వం అండదండలు ఉండడంతో ముందు వెనక ఆలోచించకుండా దొరికిన కాడికి దోచుకోవాలని జీవోలు తెచ్చుకుంటున్నారు. తాజాగా టికెట్స్ రేట్ల పెంపు వ్యవహారం మరోసారి తీవ్ర విమర్శలకు దారి తెస్తోంది. Also Read…