ఆడియెన్స్ ని తెలుగు నిర్మాతలు ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారో చెప్పడానికి ఇదో ఉదాహరణ. కోట్లకు కోట్లు బడ్జెట్లు పెట్టేసి మాకు అంత అయింది ఇంత అయింది అని ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి సగటు సినిమా అభిమాని నడ్డి విరుస్తున్నారు తెలుగు నిర్మాతలు. ప్రభుత్వం అండదండలు ఉండడంతో ముందు వెనక ఆలోచించకుండా దొరికిన కాడికి దోచుకోవాలని జీవోలు తెచ్చుకుంటున్నారు. తాజాగా టికెట్స్ రేట్ల పెంపు వ్యవహారం మరోసారి తీవ్ర విమర్శలకు దారి తెస్తోంది.
Also Read : Tiger Shroff : బాఘీ4 టీజర్.. ఆ సినిమాకు చీప్ కాపీ
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్ 2 సినిమాను తెలుగులో సితార నాగవంశీ సుమారు రూ. 90 కోట్లకు కొనుగోలు చేసారు. మరోవైపు రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ సినిమాను రూ. 45 కోట్లకు కొన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ మేము అంత పెట్టి కొన్నాం మాకు టికెట్స్ రేట్లు పెంచండి అని జీవోలు తెచ్చుకుంటున్నారు. కూలీ చెన్నై లో PVR : రూ. 183 కాగా హైదరాబాద్ PVR : రూ. 453 గా ఉంది. కూలీకి సొంత స్టేట్ లో అంత తక్కువ రేటు ఉంటే మన దగ్గర మాత్రం దానికి మూడింతలు పెంచి మరి సొమ్ము చేసుకుంటున్నారు. అటు వార్ 2 కు అటు ఇటుగా ఇవే ధరలు. డబ్బింగ్ సినిమాలకు ఇంత రేట్లు పెంచడం అనేది ప్రేక్షకుడిని దోచుకోవడమే అని ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంత పెంచిన సరే వెర్రి అభిమానులు చూస్తరులే అని గ్రాంటెడ్ గా తీసుకోవడం మంచి పద్ధతి కాదు. ఈ పరిస్థితి ఇలాగె కొనసాగితే బాయ్ కాట్ సినిమా థియేటర్స్ అనే రోజు వస్తుంది. అప్పుడు ఎంత తగ్గించిన థియేటర్స్ లో సినిమాలు చూసే ఉండరు.