దక్షిణ అయోద్యగా వర్థిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామ నవమికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అయితే టిక్కెట్ల విక్రయాలను ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టిక్కెట్ల విక్రయాలన్నింటిని ఆన్ లైన్ లో పెట్టామని చేతులు దులుపుకుంటున్నారు దేవస్థానం అధికారులు. ఏ దేవాలయంలో లేని ప్రత్యేకత భద్రాద్రి దేవాలయానికి శ్రీరామ నవమికి ఉంటుంది. శ్రీరామ నవమి నాడు శ్రీసీతారాముల కళ్యాణం భద్రాచలంలో ఎప్పుడు జరుగుతుందో దేశ వ్యాపితంగా అదే సమయంలో…