ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం శుక్రవారం మధ్యాహ్నం జరుగుబోతోంది. గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం, చిత్రసీమ మధ్య కనిపించని అగాథం ఏర్పడింది. సినిమా టిక్కెట్ రేట్లను ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధికంగా థియేటర్లలో అమ్ముతున్నారని, అలానే థియేటర్ల లైసెన్సులు రెన్యూల్ చేసుకోకుండా సినిమాలను ప్రదర్శిస్తున్నారని, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ నూ పొందకుండా సినిమా హాళ్ళు నడుపుతున్నారని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో…