కేరళ రాష్ట్రంలో ఏటా నిర్వహించే అతి పెద్ద పండుగ త్రిసూర్ పూరం. లాక్ డౌన్ కారణంగా రెండేళ్ళ నుంచి ఈ ఉత్సవం జరగలేదు. ఈ ఏడాది కరోనా కేసులు తగ్గడంతో త్రిసూర్ పూరం ఉత్సవం వైభవోపేతంగా జరుగుతోంది. ఈసారి ఉత్సవంలో లక్షలాదిమంది పాల్గొంటారని అధికారులు చెబుతున్నారు. త్రిస్సూర్ పూరం 18వ శతాబ్ధపు కొచ్చి రాజు శక్తి తంపురాన్ ప్రారంభించిన వార్షిక పండుగగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ ఉత్సవం 36 గంటలపాటు సాగుతుంది. ప్రధాన ఉత్సవాలు…