కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కగార్ ఆపరేషన్ తో మావోలు అడవిని వీడి జనంబాట పడుతున్నారు. ఇప్పటికే పలువురు మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాజాగా మరో ముగ్గురు సీనియర్ మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. ముగ్గురు స్టేట్ కమిటీ సభ్యులు జన జీవన స్రవంతి లో కలిశారని తెలిపారు. కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తోడెం గంగ అలియాస్…
మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. బాంరగడ్ తాలుక కత్రన్ గట్ట అటవీప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు, ఒక మగ మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోంది.