అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇటీవల వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. కావాలని చేసుకుంటున్నారో లేక అనుకోకుండా జరుగుతోందో కానీ.. సమస్యలు మాత్రం వెంటాడుతున్నాయి. ఈ మధ్య కాలంలో రాప్తాడులో జరుగుతున్న సంఘటనలు పీక్ స్టేజ్ కి వెళ్తున్నాయి. గతంలో పరిటాల కుటుంబంపై సుధీర్ఘ పోరాటం తరువాత 2019 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి విజయం దక్కింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. తర్వాత ఆయనకు అన్నీ సమస్యలే. అధికారం లేనప్పుడు నాయకులకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే…